వ్యక్తిపై దాడి.. కేసు నమోదు

GNTR: వ్యక్తిగత గొడవల నేపథ్యంలో తాళ్లాయపాలెం గ్రామానికి చెందిన దున్న బాలకోటయ్యపై ఐదుగురు దాడి చేసిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తుళ్లూరు SI ఏడుకొండలు తెలిపిన సమాచారం మేరకు.. పోలగంగు కిరణ్, నరేశ్, రాజి, ప్రవీణ్ మిక్కిలి మరియదాసులు బాలకోటయ్యపై దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైంది. బాలకోటయ్య ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.