కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన హరీష్ రావు
SDPT: సిద్దిపేటలో రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలని అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన నిరాహార దీక్షకు మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను రోడ్లపైకి తీసుకువచ్చిందని, ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.