VIDEO: జర్నలిస్ట్ చట్టాలను పునరుద్దరించాలని ధర్నా
AKP: రద్దు చేసిన జర్నలిస్ట్ చట్టాలను పునరుద్దరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. కేంద్రం రద్దు చేసిన జర్నలిస్ట్ చట్టాలతో జర్నలిస్టుల ఉనికికే ప్రమాదం ఉందని వారు అన్నారు. తక్షణమే ఈ చట్టాలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.