'అర్సేలార్ మిట్టల్–నిప్పన్ స్టీల్ ప్లాంట్' హోంమంత్రి పరిశీలన
AKP: నక్కపల్లిలో 'అర్సేలార్ మిట్టల్–నిప్పన్ స్టీల్ ప్లాంట్' శంకుస్థాపన ఏర్పాట్లను హోంమంత్రి అనిత క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. సుమారు రూ.1.50 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో, దాదాపు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నామని చెప్పుకొచ్చారు. ఈ మెగా ప్రాజెక్ట్ కూటమి ప్రభుత్వ సమర్థవంతమైన పనితీరుకు, పారిశ్రామిక విజన్‌కు నిదర్శనమని పేర్కొన్నారు.