పురుగుల మందు తాగి ఓ వ్యక్తి మృతి

BDK: చర్ల మండలంలోని రాళ్లగూడెం గ్రామానికి చెందిన యాలం రాము (50) శుక్రవారం ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్మకు పాల్పడ్డాడు. ఇంట్లో అపస్మారక పరిస్థితుల్లో ఉన్న రాముని గమనించిన గ్రామస్తులు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతికి గల కారణాలు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.