అమ్మాపురం సర్పంచ్‌గా ముద్ధం సునీత వీరారెడ్డి విజయం
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ముద్ధం సునీత వీరారెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. తన ప్రత్యర్థిపై 2,175 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆమె గెలుపుతో గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.