'మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేయూత'
ప్రకాశం: మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేయూతనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరంజనేయ స్వామి అన్నారు. శనివారం కొండపిలోని శ్రీ సీతారామ కల్యాణ మండపంలో డీఆర్‌డీఏ వెలుగు సిబ్బంది ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు మెగా రుణ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని పేర్కొన్నారు.