VIDEO: సాలూరులో అగ్ని ప్రమాదం.. చెలరేగిన మంటలు

PPM: సాలూరు పట్టణంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక పట్టణంలో జైపూర్ రోడ్డులోని ఓ షాపులో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.