'నోటీసులు లేకుండా తొలగించడం చట్టవిరుద్ధం'

KDP: నగరపాలక సంస్థలో చెత్త పన్ను వసూళ్ల అవకతవకలపై చిన్న కార్మికులను వెంటనే తొలగించి, పర్మనెంట్ ఉద్యోగులను మాత్రం సస్పెండ్ చేయడాన్ని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ బాదుల్లా తీవ్రంగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం కడపలో ఆయన మాట్లాడుతూ.. ముందస్తు నోటీసులు లేకుండా తొలగించడం చట్టవిరుద్ధమని, దీనివల్ల కార్మికుల కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.