VIDEO: స్కూటీపై ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

ప్రకాశం: మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బుధవారం పట్టణంలోని పలు ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా స్కూటీ మీద తిరుగుతూ.. వార్డులోని సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ఆరోగ్యం బాగా చూసుకోవాలని వారికి హితవు పలికారు. స్వయంగా ఎమ్మెల్యే తమ వార్డులో పర్యటించడాన్ని చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు.