ప్రశంసాపత్రం అందుకున్న మున్సిపల్ కమిషనర్

ప్రశంసాపత్రం అందుకున్న మున్సిపల్ కమిషనర్

GDWL: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గద్వాల జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో స్థానిక కలెక్టర్ బీఎం సంతోష్ జెండా ఎగరవేశారు. అనంతరం వివిధ శాఖలలో ఉత్తమ సేవలను అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ క్రమంలో అలంపూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీరాములుకు ఉత్తమ సేవలకు గాను ప్రశంసా పత్రం ఇచ్చారు. ప్రశంసా పత్రం అందుకోవడం సంతోషకరంగా ఉందని కమిషనర్ తెలిపారు.