మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

NLG: నల్లగొండ జిల్లా ఇంఛార్జ్ మంత్రి, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను చింతపల్లిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. మంత్రి దేవరకొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటానికి వెళ్తుండగా మార్గమధ్యంలో చింతపల్లి శ్రీ సాయి సన్నిధిలో కాసేపు గడిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.