ఈ నెల 20 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
NZB: TU పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో B.A/B.Com/B.Sc/BBA/BCA 1,3,5 రెగ్యులర్, 2,4,6 బ్యాక్ లాగ్ (2021-2025) సెమిస్టర్ల డిగ్రీ పరీక్షలు ఈ నెల 20 నుంచి నిర్వహించనున్నట్లు COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 20 నుంచి డిసెంబర్ 10 వరకు ఉ. 9గం. నుంచి 12గం. వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.