అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ప్రకాశం: మార్కాపురం మండలం కోలభీమునిపాడు గ్రామంలో సత్యనారాయణ రెడ్డి అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంపై ఆధారపడిన అతనికి సుమారు రూ. 20 లక్షల అప్పు మిగిలిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందాడు.