VIDEO: మేధా పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

HYD: సికింద్రాబాద్‌లోని మేధా పాఠశాల సీజ్ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల సీజ్ అయిన విషయం తెలియని విద్యార్థులు సోమవారం యథావిధిగా బడికి వచ్చారు. గేటుకు తాళంవేసి ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు. పాఠశాల యాజమాన్యం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.