కొండగట్టు ఆలయ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్

కొండగట్టు ఆలయ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్

JGL: కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు వచ్చే నెల 1 నుంచి 3 తేదీ వరకు జరగనున్న సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలకుంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఆలయ పరిసరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి ఇవాళ పరిశీలించారు. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.