VIDEO: కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలనే కుట్ర: ఎంపీ
JN: జనగామ మండలం ఓబుల్ కేశవపురంలో ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం నిరసన చేపట్టింది. ఏఐసీసీ మెంబర్ విశ్వనాథన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తోందని ఆరోపించారు.