జిల్లా ఉపాధి శిక్షణ అధికారిణిగా మెస్సి ఇవాంజీలిన్
VZM: విజయనగరం జిల్లా ఉపాధి శిక్షణ అధికారిణిగా ఆర్.మెస్సి ఇవాంజీలిన్ శనివారం పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. దీంతోపాటు విశాఖపట్నం జిల్లా ఉపాధి అధికారిణి రెగ్యులర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈమె ఏపీపీఎస్సి గ్రూప్-1 సర్వీస్ ద్వారా ఈ పదవి ఎంపికయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న వహీదా నుంచి బాధ్యతలు తీసుకున్నారు.సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.