డ్రంక్ అండ్ డ్రైవ్‌కు జ్యుడీషియల్ రిమాండ్
MBNR: జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో బబ్లు అనే వ్యక్తి పట్టుబడ్డాడు. కేసును విచారించిన జడ్చర్ల కోర్టు న్యాయ మేజిస్ట్రేట్ కే. నరసింహులు నిందితుడికి మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఈ విషయాన్ని ఎస్సై జయప్రసాద్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.