VIDEO: రోడ్డు ప్రమాదం.. స్నేహితులు మృతి
MLG: ఒంటిమామిడిపల్లికి చెందిన యాకుబ్, ఉడుతగూడెంకు చెందిన వెంకట్ రెడ్డి చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు రాంపూర్ వెళ్లి తిరిగి వస్తుండగా, వెంకటాపురంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వెంకట్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ యాకుబ్‌ను MGM దవాఖానకు తరలించగా మార్గమధ్యలో మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.