సీపీని కలిసిన విశ్వహిందూ పరిషత్ నాయకులు

WGL: వరంగల్ మహానగరంలో ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి శోభాయాత్ర కోసం అనుమతిని ఇవ్వాలని కోరుతూ సీపీ సన్ ప్రీత్ సింగ్‌ను నేడు హిందూ సంఘాల నాయకులు వినతి పత్రం సమర్పించారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ హిందూ సంఘాల నాయకులు సీపీని కలిసి సన్మానించి అనుమతిని కోరారు. ఈ కార్యక్రమంలో నేలకొండ భాస్కరరావు, కేశవరెడ్డి, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.