జిల్లాలో వర్షపాతం వివరాలు

జిల్లాలో వర్షపాతం వివరాలు

MBNR: శనివారం రాత్రి 10 గంటల సమయానికి మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలో మిడ్జిల్ మండలంలో అత్యధికంగా 14.2 మీ.మీల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా బాలానగర్ మండలంలో 0.3 మీ.మీల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 4 మండలాలలో ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు. సగటున జిల్లాలో 4.3 మీ.మీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.