రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు
W.G: కొయ్యలగూడెం మండలం కన్నాపురం నుంచి ఐటీడీఏకి వెళ్లే ప్రధాన రహదారిపై ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారిని 108 ద్వారా ఆసుపత్రి తరలించినట్లు పేర్కొన్నారు.