కాబోయే భర్త వేధింపులతో యువతి ఆత్మహత్య

కాబోయే భర్త వేధింపులతో యువతి ఆత్మహత్య

కడప జిల్లాలోని భర్త వేధింపులతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఐటీ ఉద్యోగి షాజహన్ అనే వ్యక్తితో యువతికి నిశ్చితార్థం అయింది. అయితే తనకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, తానంటే ఇష్టం లేదని యువతిని వేధించడంతో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలి వద్ద 12 పేజీల సూసైడ్ నోట్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.