ఇసుక రీచ్ వద్ద లారీ డ్రైవర్ మృతి

ఇసుక రీచ్ వద్ద లారీ డ్రైవర్ మృతి

KNR: మానకొండూరు (M) ఊటూరు ఇసుక రీచ్‌లో ఓ లారీ డ్రైవర్ తన వాహనం క్యాబిన్‌లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తోటి డ్రైవర్లు గమనించేసరికి ఆయన బోర్లా పడి ప్రాణాల్లేకుండా కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి కారణం తెలియక దర్యాప్తు చేపడుతున్నారు.