VIDEO: బస్సులకు అత్యవసర ద్వారాలు ఉండాలి: RTO
TPT: శ్రీకాళహస్తి RTO ఆఫీసులో ఆర్టీవో దామోదర్ నాయుడు శ్రీకాళహస్తి పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బస్సులను సురక్షిత స్థితిలో ఉంచుకోవాలని యాజమాన్యానికి సూచించారు. అనంతరం అన్ని బస్సులలో ఫైర్ అలారం, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ అమర్చి అందుబాటులో ఉంచమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.