VIDEO: రోడ్డు ప్రమాదం.. ఫ్లైఓవర్ పైనుంచి ఎగిరిపడ్డ యువకులు

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఫ్లైఓవర్ పైనుంచి ఎగిరిపడ్డ యువకులు

HYD: పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున అతివేగంతో వచ్చిన ఓ పల్సర్ బైక్ సైడ్ వాల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ఫ్లైఓవర్ పైనుంచి ఎగిరి కిందపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు యువకుల కాళ్లు, చేతులు విరిగాయి. బేగంపేట నుంచి బంజారాహిల్స్ వస్తుండగా ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.