'కోడిపందాల శిబిరంపై దాడులు'

'కోడిపందాల శిబిరంపై దాడులు'

NLR: ఆత్మకూరు మండలం బట్టేపాడు సమీపంలోని పొలాలలో ఆదివారం కోడిపందాల శిబిరంపై ఆత్మకూరు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 19 బైకులు ఎనిమిది కోళ్లు ఐదు మంది పందెం రాయుళ్లును అదుపులోకి తీసుకున్నారు.. ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎస్సైలు జిలాని, సాయి ప్రసాద్ వారి సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు. అనంతరం వీరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.