చిన్న పెండ్యాలలో హర్రర్ మూవీ షూటింగ్ పూర్తి

చిన్న పెండ్యాలలో హర్రర్ మూవీ షూటింగ్ పూర్తి

HNK: ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో కొద్దిరోజులుగా 'మా ఊరి బావి' అనే హర్రర్ మూవీ చిత్ర షూటింగ్ జరుగుతున్నది. ఈ క్రమంలో శనివారం షూటింగ్ పూర్తి అయినందుకు చిత్ర యూనిట్ తెలిపింది. గ్రామంలో షూటింగ్ పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, గ్రామ ప్రజలు చాలా సహకరించారని, వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. షూటింగ్ చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు.