'రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

'రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

ADB: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్ర వైద్య బృందం అధికారి నీహాన్స్ అన్నారు. రూరల్ మండలంలోని అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి రోగులకు అందుతున్న వైద్యాన్ని ఆరా తీశారు. స్టోర్ రూమ్, ల్యాబ్, పరిసరాలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీరితో వైద్యులు శ్రీధర్, సర్ఫరాజ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.