బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

NLG: నకిరేకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదివారం పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించారు. నార్కెట్‌పల్లి మండలం షాపల్లికి చెందిన తంగేండ్ల కమలమ్మ, కట్టంగూరు మండలం కల్మేరకి చెందిన ముసుకు శంకర్ మాతృమూర్తి మృతి చెందగా, వారి భౌతికకాయాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పరడలో బొబ్బల రాములమ్మ దినకర్మకు హాజరై నివాళులు అర్పించారు.