ఎస్పీని కలిసిన కోకోఫెడ్ ప్రతినిధులు
కోనసీమ: ఎస్పీ రాహుల్ మీనాను అమలాపురం కోకోఫెడ్ ఛైర్మన్ అరిగెల బలరామమ్మూర్తి ఆధ్వర్యంలో సభ్యులు బుధవారం రాత్రి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పేరూరు వై జంక్షన్ వద్ద రద్దీ సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని వివరించారు.