హిందీ పరీక్షకు 24 మంది విద్యార్థులు గైర్హాజరు
ELR: ఉంగుటూరు మండలంలో బుధవారం నిర్వహించిన టెన్త్ పరీక్ష హిందీకి 24 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఎంఈవో సాయిబాబా తెలిపారు. మండలంలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు 683 మందికి గాను 659 మంది రాశారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. పరీక్ష కేంద్రాల దగ్గర విద్యార్థలకు అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు.