అడ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత

అడ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత

ఆసిఫాబాద్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో అడ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తడంతో రెండు గేట్లు ఎత్తి అధికారులు నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టులోని 4, 5 గేట్లు 0.15 మీటర్ మేర ఎత్తి 652 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.  ప్రాజెక్టు సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా ఇప్పటివరకు 5.963 టీఎంసీలకు చేరుకుంది.