పట్టణంలో బీజేపీ తిరంగా ర్యాలీ

పట్టణంలో బీజేపీ తిరంగా ర్యాలీ

గద్వాల పట్టణంలో బీజేవైఎం కన్వీనర్ పాండు పటేల్ ఆధ్వర్యంలో బుధవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. కోటగుడి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో ఎంఏఎల్‌డీ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ.. విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని, దేశాభివృద్ధికి మూలమని పేర్కొన్నారు.