VIDEO: పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నం
ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో గుంటుపల్లి రవి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక వివరాల ప్రకారం.. రవి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని నలుగురు వ్యక్తులు బెదిరిస్తున్నారని తెలుపుతూ సెల్పీ వీడియో తీసుకుంటూ ఈ దారుణానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న రవిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.