అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి సవిత
సత్యసాయి: పెనుకొండలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బీఆర్.అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. బలుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని నాయకులకు పిలుపునిచ్చారు.