'ఫీజు బకాయిలు చెల్లించే దిశగా చర్యలు చేపట్టాలి'

'ఫీజు బకాయిలు చెల్లించే దిశగా చర్యలు చేపట్టాలి'

HYD: విద్యార్థులతో చెలగాటం ఆడితే ప్రభుత్వాలు ప్రమాదంలో పడతాయని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్‌లో చేపట్టిన ఫీజు పోరు దీక్షలో పాల్గొని మాట్లాడుతూ.. రూ.7 వేల కోట్లు ఫీజు బకాయిలు చెల్లించడం ప్రభుత్వానికి లెక్క కాదని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని దత్తాత్రేయ కోరారు.