విశాఖ తీరంలో ఆధునిక తేలియాడే తెప్పలు
VSP: ఐసీఏఆర్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు రూపొందించిన 3x3 మీటర్ల హై-డెన్సిటీ పాలిథిలిన్ తేలియాడే తెప్పలు విశాఖ సముద్ర తీరంలో అందుబాటులోకి వచ్చాయి. మత్స్యకారులు వీటిని చేపల పెంపకం, వేటలో వినియోగిస్తూ సరికొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. పర్యావరణానికి హాని చేయకుండా, సముద్ర అలలను తట్టుకునేలా రూపొందించారు.