'ప్రతి రైతుకు అవసరమైన యూరియా అందేలా ప్రణాళిక'

'ప్రతి రైతుకు అవసరమైన యూరియా అందేలా ప్రణాళిక'

PDPL: ప్రతి రైతుకు అవసరమైన యూరియా అందేలా పక్కా ప్రణాళిక రూపొందించామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి రైతు వేదికలో యూరియా అమ్మకాల పర్యవేక్షణ యాప్‌పై ఎరువుల డీలర్లకు నిర్వహించిన శిక్షణలో ఆయన పాల్గొన్నారు. ఈ యాప్‌ను ప్రతి డీలర్ తప్పనిసరిగా వినియోగించుకుని రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.