మిషన్ భగీరథ నీరు వృథా
VKB: మున్సిపల్ 2వ వార్డు ధన్నారంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ కారణంగా తాగునీరు వృథాగా రోడ్డుపై పొంగి పొర్లుతోంది. నీరు రోడ్డుపై నిలవడంతో గ్రామస్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.