VIDEO: శివ భక్తితో మార్మోగిన మల్లేశ్వర స్వామి ఆలయం
KDP: చెన్నూరు మండలం ఏటిగడ్డలోని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ఆరంభం సందర్భంగా బుధవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే భక్తులు తరలివచ్చి పాలు, పన్నీరు, తేనెతో స్వామివారికి అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణం హర హర మహాదేవ నినాదాలతో నిండిపోయింది. ఈ కార్యక్రమాలు మాసమంతా కొనసాగనున్నట్లు ఆలయవర్గాలు పేర్కొన్నాయి.