జాబ్ క్యాలెండర్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
VSP: గాజువాక తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జాబ్ క్యాలెండర్ పోస్టర్‌ను ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ విడుదలతో యువతలో నమ్మకం, ఉత్సాహం పెరిగిందని పేర్కొన్నారు .భవిష్యత్తులో కూడా యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.