VIDEO: వైభవంగా స్వయంభూ వేంకటేశ్వరుని కల్యాణం

VIDEO: వైభవంగా స్వయంభూ వేంకటేశ్వరుని కల్యాణం

WGL: వర్ధన్నపేట పట్టణంలోని స్వయంభూ శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణాన్ని నిర్వహించగా, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ క్షేత్రం గృహనిర్మాణం, వివాహం, సంతాన ప్రాప్తి వంటి కోరికలు నెరవేర్చే దైవంగా భక్తులు విశ్వాసం.