అయ్యప్ప దీక్ష చేపట్టిన తంబళ్లపల్లి ఎమ్మెల్యే

అయ్యప్ప దీక్ష చేపట్టిన తంబళ్లపల్లి ఎమ్మెల్యే

అన్నమయ్య: తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథరెడ్డి గురువారం అయ్యప్ప దీక్ష చేపట్టారు. సదుం మండలంలోని యర్రాతి వారి పల్లి కోటమలై అయ్యప్ప స్వామి ఆలయంలో మాల ధారణ చేశారు. ఈ మేరకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.