'బలమైన విప్లవ పోరాటాలు చేయాలి'
PDPL: పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన విప్లవ పోరాటాలు చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కోడిపుంజుల రాజన్న పిలుపునిచ్చారు. ఐఎఫీయూ కార్యాలయంలో జరిగిన అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొని మాట్లాడారు. విప్లవ ఉద్యమంలో అమరులైన వీరుల ఆశయాలను కొనసాగించాలని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలని ఆయన కోరారు.