కారు, ఆటో ఢీ.. ఇద్దరు మృతి
MDK: ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఢీకొన్న ఘటనలో బుధవారం రాత్రి కొల్చారం మండలం పోతంశెట్టి పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మెదక్ వైపు నుంచి పోతంశెట్టిపల్లి వైపు వస్తున్న ఆటోను మెదక్ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న యూసుఫ్, కిష్టయ్యలు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు.