వేణుగోపాలుడి అలంకరణలో జ్వాలా నరసింహ స్వామి

NDL: ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో వైశాఖ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎగువ అహోబిలంలో వేణుగోపాలస్వామి అలంకరణలో ఇవాళ స్వామివారు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవారిని పల్లకిపై తిరువీధుల్లో ఊరేగించారు. మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు పంచామృత అభిషేకం చేశారు. ఇవాళ రాత్రి పొన్నచెట్టు వాహనంపై స్వామి దర్శనం ఇవ్వనున్నారు.