చెరువులో పడి వ్యక్తి మృతి

VKB: పరిగి మండలం ఇబ్రహీంపూర్ చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. నిన్న సాయంత్రం చేపల వేటకు వెళ్లిన రాగపురం నరసింహులు (35) అనే వ్యక్తి చెరువులో మునిగి మరణించాడు. అతడికి ఐదు ఏళ్ల మూగ కూతురు, మూడేళ్ల మరో కూతురు ఉన్నట్లు సమాచారం. అతడి మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.