రాష్ట్రస్థాయి పోటీలకు జన్నేపల్లి విద్యార్థి ఎంపిక
NZB: ఈ నెల 21 నుంచి 23 వరకు వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో జరగనున్న 11వ తెలంగాణ స్టేట్ లెవెల్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌కు నవీపేట్‌లోని జన్నేపల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థి ఎల్. పూర్ణానంద ఎంపికయ్యారు. ఈ విషయాన్ని హెచ్‌ఎం, ఇన్‌ఛార్జ్ ఎంఈఓ ఎస్. అశోక్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థిని వ్యాయామ ఉపాధ్యాయుడు రమేష్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.